క్షంతవ్యులు - 13

  • 9.7k
  • 1
  • 2.6k

క్షంతవ్యులు – Part 13 చాప్టర్ 31 రాజేంద్ర కారు నడుపుతున్నాడు. నేనతని పక్కన కూచున్నాను. సరళ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని కొద్దిగా ఇరుకుగా యశో దాయి లతో వెనకాల సీట్లో కూర్చుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరమూ పేదవి విప్పలేదు,పెద్దల మూడ్ గ్రహించేడో ఏమిటోచడి చప్పుడు లేకుండా బాబు నిద్రపోతున్న పోతున్నాడు లఖియా నా యాచన తిరస్కరించింది. శిక్షాకాలం ఏదో విధంగా గడిచిపోతుంది. ఆ సత్ప్రవర్తన వల్ల అది తగ్గించబడవచ్చుకూడా. ఆ తర్వాత ఆమె మా వద్దకు వస్తుంది. ఇహపరాలను లక్ష్యం చేయకుండా ఆమెను సుఖపెడతాను. జీవితమంతా చీకటిమయం కాదని నిరూపిస్తాను. ఈదారిలో ఎన్ని ఆటంకాలున్నా లెక్కచెయ్యను, అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ లఖియా మాటలతో వమ్ములయ్యాయి. ఈమె ఇంకా ఎన్ని కష్టాలు పడాలని రాసివుందో. లఖియాని ధనసహాయం స్వీకరించమని అర్థించగలిగే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరి వద్ద నుంచీ ఏమీ స్వీకరించదు అనుకున్నాను. చివరికి ఇంటికి చేరేము.