క్షంతవ్యులు - 5

  • 13.6k
  • 3.1k

క్షంతవ్యులు – Part 5 చాప్టర్ 13 యశోకి సుశీ సంగతి తెలుసునేమో అనే ఆశతో అంతవరకూ వున్నాను. ఆనాటి తర్వాత ఆమె ప్రవర్తన బట్టి ఆ ఆశ నిరాశ అని తెలిసింది. ఇక ఏమైనా ఈ వార్త ఈమెకు చెప్పాలి. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా చాలా రోజులు గడిచిపోయాయి. ప్రతి రాత్రి ఆమెకు చెప్దామనుకునేవాడిని. కానీ నోట మాట వచ్చేది కాదు. రాత్రి భోజనం అయిన తర్వాత ఇద్దరమూ కలిసి నవలలు చదివేవాళ్లం. వాటిలోని పాత్రలను గురించి చర్చించేవాళ్లం. ‘‘మీరు నవలల్లో ఎవరిపక్షం వహిస్తారు. విసర్జించబడిన ప్రేమికూడా లేక వివాహం చేసుకున్నవాడా?’’ అడిగింది ఒక రాత్రి యశో. ‘‘సాధారణంగా విసర్జించబడినవాడే యశో. అతనికి ఎంత దు.ఖం కలుగుతుంది చెప్పు. ఒక సారి హృద‌యమర్పించిన తర్వాత ఏం జరిగినా తిరిగి తీసుకోలేడుగా,’’ అన్నాను. ‘‘అయితే మీరు ఎవరి ప్రేమనూ తిరస్కరించరు కదా?’’ అంది యశో ఎంతో ఆశతో