క్షంతవ్యులు - 4

  • 13.6k
  • 3.3k

క్షంతవ్యులు – Part 4 చాప్టర్ 9 ఒక వారం రోజులు దొర్గిపోయాయి. ముస్సోరి వాతావరణం నా శరీరానికి సరిపడింది. శరీరారోగ్యంతోపాటు మనస్సుకూడా బాగయింది. యశో నన్ను పిక్నిక్ స్థలాలకి తీసుకుని వెళ్లేది. అప్పటికి ఆమె నన్ను ఏ విధంగా భావిస్తోందో తేటతెల్లమయింది. ఎవరో ‘బాదల్ బాబు’ అనే ఒక పురుషుడిని ఊహించుకుంది, ఈమె నన్ను మొదటిసారి చూసిన ఆ అశుభముహూర్తాన నేనే అతగాడినని ఈమెకు తట్టింది. “నమస్కారమండి” అన్నప్పుడు నేను పడిన తడబాటు ఈమె నమ్మకాన్ని దృఢతరం చేసింది. ఈమె మెదడులోంచి ఈ మిథ్యను ఎలా పోగొట్టటం? కాలమే ఈ సమస్యకి పరిష్కారం తీసుకువస్తుందని ఆశించాను. ఆమె నామీద ప్రదర్శించే అనురాగం, శ్రద్దా అవాంఛనీయమని ఆమెకు చూపించుదామనుకున్నాను. లేక మనస్సులో నాకు తెలియకుండానే ఆమె యెడఅభిమానం దాగియుందేమో? యశోకి సుశీ విషయం తెలిసివుంటుందనే ఆలోచనతో నన్ను నేనే మోసపుచ్చుకునే వాడిని, అలాకాకపోతే ఆమెకు ఇదంతా ఎందుకు చెప్పను? ఆరోజు రాత్రి