డాలర్ డైలమా

  • 15.9k
  • 3.5k

"ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు కుర్రాడు అనారోగ్యంతో మృతి" "ఎంత బాధాకరం" అనిపించింది,ఇది చూడగానే అమ్మ నుండి ఫోన్ వస్తుంది అని అనుకున్నాడు కార్తిక్. అనుకున్నట్టుగానే ఆఫీసు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి అప్పటికే తుషారతో మాట్లాడుతుంది. "ఇదిగో అత్తయ్యా ఈయన ఇప్పుడే వచ్చారు, చూపిస్తా ఉండండి" అని ఫోన్ ని కార్తిక్ వైపు తిప్పింది. అటు నుండి దేవకి మాట్లాడుతుంది "హెల్లో, బంగారం, వెళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని రా" అంది. "వస్తున్నా, నువు తనతో మాట్లాడుతూ ఉండు" అని ఫ్రెష్ అయి వచ్చాడు. "ఏమైనా తింటాడేమో చూడమ్మా! నేను తర్వాత చేస్తాలే.." అంటున్న దేవకి తో పర్లేదు అత్తయ్యా ఉండండి, అని స్నాక్స్ తెచ్చి అలాగే మంచినీళ్ళు తాగమని భర్త కి చెప్పి కూర్చుంది తుషార. "ఆ న్యూస్ చూసావా అమ్మా, ఎంత