క్షంతవ్యులు - 3

  • 14.1k
  • 3.7k

క్షంతవ్యులు – Part 3 చాప్టర్ 5 ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదో ఒక పీడకల వచ్చినట్టయింది. మా అమ్మ దగ్గరకు వెళ్లి ‘‘రాత్రి ఏదో పాడుకల వచ్చింది. సుశీకి ఎలావుందో ? ఆస్పత్రికి ఇప్పుడే వెళ్లి వస్తాను’’ అన్నాను. ఆమె కళ్లలోని కన్నీరు చూడగానే సుశీ నిజంగా మరణించిందనే విషయం స్ఫురణకు వచ్చింది. అప్పుడు నాకు కళ్లవెంట నీరు రాలేదు. కళ్లు చీకట్లు కమ్మాయి. అక్కడే కూలిపోయాను. సుశీ మరణం నాజీవితంలోని అతి ముఖ్యమైన సంఘటన. అది నాలోని కోరికలని, నమ్మకాల్ని సమూలంగా వూడబెరికింది. దైవం మీద నా విశ్వాసం సడలింది. భవిష్యత్తులో నా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, చేష్టలనీ తీర్చిదిద్దింది. దైవం నాకు అన్యాయం చేశాడనే అభిప్రాయం నా హృద‌ యంలో హత్తుకుపోయింది. అది ఎన్నడూ మాసిపోలేదు. చనిపోయినా సుశీకి నేను అన్యాయం చేయకూడదనే దృఢ‌ నిశ్చయానికి వచ్చాను. జీవితంలో ఇక వాటిని గురించి యోచించకూడదనుకొన్నాను. చాలా కాలంవరకు