అరుణ చంద్ర - 8

  • 14.1k
  • 3.4k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 8 మరో 18 నెలలు పిమ్మట -మోర్నింగ్వాక్లు కానిచ్చి, ఆ ఐదుగురు, లాన్లో, కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.రాము వెళ్లి పోయిన తర్వాత, శ్రీరాజ్, "డియర్స్, నా గోల్ రీచింగ్కు దరి అయ్యాను. పేపర్స్ సిద్ధమైపోయాయి. సబ్మిట్ చేయడమే మిగిలింది." అని చెప్పాడు, చాలా హుషారుగా.అందరూ చప్పట్లు చరిచారు."గుడ్ జాబ్, కంగ్రాట్స్" అన్నాడు కృష్ణమూర్తి తొలుత.పిమ్మట ఆ మిగతా ముగ్గురూ కంగ్రాట్స్ చెప్పారు.అందరికీ థాంక్స్ చెప్పాడు శ్రీరాజ్."ఇప్పటికైనా మాకు నువ్వు ఆ పేపర్స్ ద్వారా చెప్పబోయేది ముందుగా తెలియచేస్తావా" అని అంది లక్ష్మి, కుతూహలంగా."ఎందుకు వాడిపై వత్తిడి. అంతటికీ త్వరలో తెలియచేయబోతున్నాడుగా" అన్నాడు కృష్ణమూర్తి.అరుణ, చంద్ర ఏమీ అనలేదు. కానీ వారికీ ముందుగా తెలుసుకోవాలని ఉంది.శ్రీరాజ్ చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. తప్పా, దానికై ఎట్టి వ్యాఖ్య చేయలేదు. కానీ, "నేను మధుమతిని కలవాలనుకుంటున్నాను" అని చెప్పాడు, గబుక్కున."తను గుర్తు ఉందా" అని అడిగింది అరుణ, విస్మయంగా."నేచురలీ.