అరుణ చంద్ర - 7

  • 11.5k
  • 3.4k

రచయిత : బివిడి ప్రసాదరావు ఎపిసోడ్ 7 మోర్నింగ్వాక్ తర్వాత, లాన్లోకి లక్ష్మితో కలిసి వచ్చిన కృష్ణమూర్తి, ఆల్రడీ అక్కడ ఉన్న అరుణ, చంద్రలను చూసి, "ఈ రోజు మధ్యలో ఆపేసి వచ్చేశారా వాకింగ్ను" అని అడిగాడు వాళ్లను, కుర్చీలో కూర్చొని.అరుణ చుట్టూ తల తిప్పి చూసింది. శ్రీరాజ్ దూరాన వాకింగ్ చేస్తూ కనిపించాడు.ఆ వెంటనే, "శ్రీరాజ్ ఏం అంటున్నాడు నాన్నా" అని అడిగింది అరుణ, టక్కున."అదా సంగతి." అని నవ్వేడు కృష్ణమూర్తి, లక్ష్మి వంక చూస్తూ."మీరు ఇక్కడకు చేరడం చూసే, మీ నాన్న, నన్ను తీసుకొని వచ్చేశారు అరుణా" అని చెప్పింది లక్ష్మి, నవ్వుతూనే.ఆ తర్వాత, మరి ఆలస్యం చేయక, రాత్రి శ్రీరాజ్కు, తనకు మధ్య జరిగింది చెప్పాడు కృష్ణమూర్తి, క్లుప్తంగా, అన్నింటిని. ఆ తర్వాత, "శ్రీరాజ్ వెల్డన్ బోయ్" అన్నాడు కూడా.అరుణ, చంద్ర మురిసిపోయారు.అప్పుడే రాము ఐదు వాటర్ బాటిల్స్ను వారి మధ్య ఉన్న టీపాయ్ మీద పెట్టాడు.