శశివదనే - మొదటి భాగం

  • 24k
  • 2
  • 12.2k

అది హంపి నగరాన్ని శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలిస్తున్న కాలం. శివుడు విరూపాక్ష ఆలయంలో ప్రధాన శిల్పిగా ఆ రోజే నియమించబడ్డాడు. శివుడికి ఒక ఇరవై-పాతిక ఏళ్ల వయసు ఉంటుంది. అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని పెదనాన్న సంరక్షణ లోనే పెరిగాడు. శివుడికి చిన్నప్పటి నుండి శిల్ప కళ మీద అభిరుచి. అతడు చేసిన శిల్పాలలో జీవం ఉట్టిపడుతుందని అందరూ గొప్పగా చెప్పుకోవటం తో ఆ వార్త రాజు గారి చెవిన పడి ఆయన నుండి పిలుపు వచ్చింది. ఆ రోజు కాలినడకన తన గ్రామం నుండి హంపి నగరానికి చేరుకున్నాడు. అప్పటి వరకు ఆ నగరం గురించి వినటమే కానీ అదే చూడటం. ఆ మహా నగరాన్ని చూడటానికి అతడి రెండు కళ్ళు చాలటం లేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావటం వల్ల వీధులు దీపాల కాంతి తో మెరిసి పోతున్నాయి. విరూపక్షుని గుడికి చేరువ అయ్యే కొద్దీ