అప్రాశ్యులు - 14 - Last part

  • 7.8k
  • 2.8k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 14 ఆ రాత్రి రజని రామం గురించే ఆలోచించింది. మరునాడు రామం తనతో మాట్లాడదలచిన దేమిటోకూడ ఆమె గ్రహించింది. సమాధానం ఏం చెప్పాలో ఆమె తర్కించుకుంది. రామం మొదటనుంచీ ఆమెకొక సమస్యగానే వున్నాడు. తిరస్కరించలేని ఆ నిగూఢ ప్రేమ భరించరాని బలహీనత సంపూర్ణమైన ఆసమర్పణ ఆ సమస్యకి పరిష్కారం లభించకుండ చేశాయి. రాధా రాణీ ఆగమనం దానికి పరిష్కారంగా ఆమె మనస్సుకి తోచింది. బాల్యం నుంచి రాధకి రామం మనస్తత్వం తెలుసును. అతనిని అర్ధం చేసుకుంది. రాధ ఆధారంతో రామం నిరాటంకంగా ముందుకు సాగిపోగలడనే ధైర్యం రజనిలో కలిగింది. రామం హృదయంలో రాధ యెడల బలవత్తరమైన ప్రేమ లేకపోయినా అతని సున్నిత హృదయంలో సహజీవనం ఆ బీజాలను నాటగలదని రజనీ గ్రహించింది. ఇతరుల బరువు బాధ్యత మోయడమనేది రజనీకి కొత్త కాదు బాల్యం నుంచీ ఆమెకు అలవాటే. కాని ఆమె సమర్పించలేనిది అతగాడు ఆశించిలభించక సతమతమవుతూంటే