అప్రాశ్యులు - 10

  • 11.2k
  • 2.7k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 10 మరునాడు స్టేషన్ లో అందరు రజనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రామం, విశాల, డాక్టర్ సనల్, కమల, కమలాకరం, ప్రసాద్, చంద్రిక అందరు వచ్చారు. ప్రసాద్ క్రితం రాత్రి ఢిల్లీ తిరిగి వచ్చాడు. న్యూఢిల్లీ ప్లాటుఫారంమీద అందరు నిలబడి వున్నారు. ప్రసాద్ రజనితో “నాకు స్టేషన్ కి వచ్చి వీడ్కోలు చెప్పడం చేతిరుమాళ్ళు వూపడం ఇలాంటి పనులంటే ఇష్టం లేదు. రజనీ, అయినా నీ విషయంలో ఇన్స్పెక్షన్ చేసేను” అన్నాడు. “అది మీ బలహీనత. నాయెడ గౌరవ సూచనమని నేను గర్వపడను” అంది రజని. “అది నాకు తెలుసును రజనీ, కాని నాకు ఇది గర్వ కారణమే” అన్నాడు ప్రసాదు. కమల కమలాకరం కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లో చాలా జనసమర్థంగా వుంది. చంద్రిక, విశాల, డాక్టర్, వృద్ధ దంపతులతో కబుర్లు చెప్పుతున్నారు. రైలు ప్లాటుఫారం మీదికి వచ్చే వేళయింది. ప్రసాదు