అప్రాశ్యులు - 6

  • 10.6k
  • 2.6k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 6 మరునాడు సాయంకాలం రామం, రజని కలుసుకొని విశాలకోసం ఎదురు చూడసాగారు. రైలు గంటన్నర లేటు అని తెలిసింది. ప్లాటు ఫారంమీద వున్న బెంచీపై కూర్చుని మౌనంగా వున్నారు. రామం హఠాత్తుగా జేబులోంచి వొక ఉత్తరం తీసి రజని చేతిలో కిచ్చి “యిది చదువుకో రజనీ” అన్నాడు. “ఎవరి ఉత్తరం” అంది రజని. “మా నాన్నగారిది. నువ్వు చదవకూడనిది ఇందులో ఏమి లేదు అన్నాడు. రామం. రజని వుత్తరం చదివి నవ్వుతూ “శుభవార్త ఎప్పుడు పెళ్ళి” అంది. ఆ మాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. రజని బాధపడుతుందనీ, విచారం వ్యక్తం చేస్తుందనీ అనురాగపువాక్యాలు పలికి పూరడిస్తుందనీ వూహించుచున్నాడు. “నీకిది శుభవార్త కావచ్చు రజనీ కాని నాకిది ఎంతో దుఃఖవార్త. నువ్వింక చెప్పవలసింది ఇంకేమీ లేదా? అన్నాడు రామం. “చెప్పవలసిందింకేమి లేదు రామం బాబూ కాని మీరు గ్రహించవలసింది చాలా వుంది” అంది రజని. రామం