రైతు కష్టం

  • 17.7k
  • 5k

రైతు కష్టం అంటే కష్టపడే రైతు జీవితం లో కోలుకోలేని కష్టం ఎదురవ్వడం అని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రపంచం లో బీదవాడు, ధనికుడు అనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రతి రోజు ఆకలితో పోరాడుతూనే ఉంటారు. ఇందులో ధనికుడు ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువ కష్టపడడు కానీ ఒక్క బీదవాడు ఆకలి తీర్చుకోవడానికి ప్రతి రోజు చెప్పలేనంత, చెయ్యలేంత , చూస్తూ ఉండలేనంత కాయ కష్టం చేస్తుంటాడు. కానీ ఈ రెండు వర్గాల కడుపునింపే ప్రతి ఒక్క చిన్నకారు రైతు కుడా బీద వర్గానికి చెందిన వాడే. కానీ ఈ రైతు చేతులు పంట పండించి అన్నం పెట్టె చేతులు. అలంటి అన్నం పెట్టె చేతులకు కష్టం ఎదురయ్యే యదార్ధ సంఘటనే ఈ కథ....!!! ఒక్క గ్రామంలో సన్నకారు రైతు ఉండేవాడు. అతని పేరు లచ్చన్న. అతనికి 2 ఎకరాల పొలం భూమి ఉంది. అతనికి ఇద్దరు కొడుకులు మరియు అలాగే ఇద్దరు కూతుర్లు . అతని జీవనం అంతంత మాత్రమే...