లంచం - గుణ పాఠం

  • 14.2k
  • 3.1k

లంచం - గుణపాఠం ఒక ఊరిలో రంగారావు అనే రైతు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. ఇంట్లో వాళ్ళ భార్య రంగమ్మ కొడుకు రాములు నివాసం ఉండేవారు. అతనికి రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ,జీవనం సాగిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు పని చేసినా కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఒక్కగానొక్క కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటూ, వారు తిన్న తినకున్నా అతనికి తిండి పెట్టే వారు. కొడుకు రాములు కూడా అన్ని విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.కొడుకు రాములు కూడా ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకుని చిన్నప్పటినుండి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రానురాను రాములును చదివించడం రంగారావు కష్టంగా మారింది.పదవ తరగతి పరీక్ష ఫీజు కట్టడానికి కూడా చిల్లిగవ్వ లేదు. అది గుర్తించిన రాములు బడి మానేసి పొలం పనులకు వెళ్లేవాడు. రంగారావు అదే ఊరిలో ఉండే ఒక వడ్డీ వ్యాపారి సోమయాజులు దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని, రాముల్ని మళ్లీ