ప్రేయసా?దెయ్యమా?

(24)
  • 146k
  • 2
  • 52.8k

ప్రేయసా ? దెయ్యమా?********************రఘు ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి.ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ అది కొద్దికాలం మాత్రమే అని తనకు తర్వాత అర్థం అయింది.ఒక రోజు ఆఫీస్ లో తను చేసే వర్క్ కంప్లీట్ కాలేదని వాళ్ళ బాస్ అరిచాడు.అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ తననే చూశారు మరియు బాస్ కళ్ళలో చెరుగుతున్న నిప్పుల్ని కూడా.రఘు తప్పదు అన్నట్టు బాస్ అనే ప్రతిమాటను పడ్డాడు. ఈ రోజు నా గ్రహచారం ఏమీ బాగోలేదు, ఎలాగైనా పని పూర్తయిన తరువాతనే ఇంటికి వెళ్ళాలి అని పట్టుపట్టి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తునే ఉంటాడు.అందరూ ఆఫీస్ టైమ్ అయిపోయిందని బయలుదేరుతారు."హే రఘు, నువ్వు రావా మామ" అని మిత్రుడు సురేష్ అడుగుతాడు."అరేయ్ ,నువ్వే విన్నావుగా..బాస్ నన్ను ఎన్ని మాటలు అన్నారో,ఎప్పుడు అలాంటి మాటలు నేను పడలేదు.మా అమ్మ నాన్న కూడా అలా నన్ను తిట్టి ఉండరు.మన