తులసీ కళ్యాణం

  • 56.5k
  • 19.6k

శ్రీ మహావిష్ణువు ఆలయం.ప్రక్కనే తోట.తోటలో ఉసిరి చెట్టు.కార్తీక మాస వన భోజనాలకి ఇంతకంటే అనువైన చోటు ఏముంటుంది.ఇవాళ శారదమ్మ కుటుంబంలోని వారంతా వన భోజనాలకి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అసలు ఆ గుడి కట్టించింది శారదమ్మ వాళ్ళ తాత గారు.చిన్నప్పటినుంచీ ఆ గుడికి రావడం ఆమెకు అలవాటు. పెరిగి పెద్దయినా పెళ్లయినా ఆమె ఆ గుడికి వచ్చే అలవాటు మానలేదు. పెద్దయ్యాక ప్రతి కార్తీక మాసంలో తులసీ కళ్యాణం చేయించడం.వన భోజనాలు.ఆ హడావిడే వేరు.భర్త కాలం చేసినా గుడికి సంబంధించిన ఏ విషయంలోనూ లోటు రానివ్వలేదు. ఈ సారి వన భోజనాలకి కూతుళ్ళు,అల్లుళ్ళు,కొడుకులు,కోడళ్ళు,మనుమలు అందరూ కలిసి రావడంతో ఆవిడ ఆనందానికి అవధుల్లేవు. అందరూ బంతిలో కూర్చున్నారు.బంధువులంతా మాటలతో కాలక్షేపం చేస్తూ విందు ఆరగిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ముసలామె వచ్చి బంతి చివరిలో ఉన్నశారదమ్మ ప్రక్కన కూర్చుంది. పోవే పో.ముదనష్టపు దానా.నువ్వు నా ప్రక్కన కూర్చుంటావా.ఎంత