క్రిష్ణబిలం

  • 14.9k
  • 1
  • 3.6k

క్రిష్ణబిలం అంటే అంతరిక్షం లో ఒక ప్రాంతం. క్రిష్ణబిలం నే బ్లాక్ హోల్ అని అంటారు. దీనియొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ వుంటుంది. కనీసం కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ ఎక్కువ గురుత్వాకర్షణ కలిగి వుంటుంది ఎందుకు అంటే అంతరిక్షం లో వున్న మాటర్{గ్యాస్, డస్ట్, గ్రహాలు,...} చాలా తక్కువ ప్రాంతంలో కుదించబడి వుండటం వల్ల మాస్ ఎక్కువ వుంటుంది. మాస్ ఎంత ఎక్కువ వుంటే అంత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి వుంటుంది.బ్లాక్ హోల్ నుండి కనీసం కాంతి కూడా తప్పించుకోలేదు అందుకే మనం బ్లాక్ హోల్ ని చూడలేము. ఎందుకు అంటే మనం ఏ వస్తువు అయినా చూడాలి అంటే ఆ వస్తువు కాంతి ని తనగుండా వెళ్లకుండా ఆపి తిరిగి కాంతి ని ప్రతిబింబించాలి. ఉదాహరణకు మనం ఒక బాటిల్ ని చూడగలం ఎందుకు అంటే బాటిల్ కాంతిని తనగుండా వెళ్లకుండా ఆపి తిరిగి ప్రతిబింబిస్తుంది.