ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు)

  • 21.8k
  • 1
  • 5.7k

శ్యాం: ఎందుకేంటి...మీలాగే చచ్చిపోవడానికి...ఎందుకూ పనికి రానివాడని అందరూ అంటున్నారు.నేను మాత్రం ఎంతకాలం భరించగలను,ఎందుకు బ్రతకాలని నాకూ అనిపించింది... అందుకే చనిపోవాలని అనుకున్నానుకానీ ఎందుకనో ధైర్యం చేయలేక పోతున్నాను..ఇలా ఐతే ఎలా అని ఆలోచిస్తున్నాను...ఇంలోనే చద్ది పెరుగన్నంలో ఆవకాయ బద్దల్లా చచ్చిపోవడానికి తోడుగా మీరు దొరికారు...రండి అందరం కలిసే ఈ ఘనకార్యం చేద్దాం అంటూ మాత్రలు అందరికీ పంచుతాడుఅందరూ కలసి నిద్ర మాత్రలు ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి వారిని వద్దని వారిస్తూ ఇలా అంటాడు..వచ్చిన వ్యక్తి: ఆగండి...ఆగండి ...ఒక్క క్షణం ఆగండి నా మాటలు వినండి..మీరు చేస్తోంది ఎంత పెద్ద పొరపాటో గ్రహించండి..తమకు ఏమాత్రం పరిచయంలేని ఒక అజ్ఞాత వ్యక్తి హఠాత్తుగా వచ్చి అన్న ఆ మాటలకు ఆశ్చర్యపోయిన ఆ మిత్రులు... ఆ వ్యక్తికేసి తదేకంగా చూశారు చూడడానికి సామాన్య వ్యక్తిలా ఉన్నా ముఖంలో దివ్య తేజస్సు ప్రస్ఫుటంగా గోచరిస్తోంది.. కొన్ని క్షణాలు అందరూ మౌనంగా ఉండిపోయారు... కాసేపటి తరువాత